అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా... ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని కనిగిరి, వెలిగండ్ల, హనుమంతునిపాడు మండలాల్లో తెదేపా నేతలు నిరసన చేపట్టారు. స్థానిక తహసీల్దార్లకు వినతి పత్రాలు అందించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ముఖ్యమంత్రి జగన్... మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని, ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
'రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మూడు రాజధానుల అంశం'
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో తెదేపా నేతలు ఆందోళన చేశారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
కనిగిరి నియోజకవర్గంలో తెదేపా నేతల ఆందోళన