రోహిణీ కార్తెలో భానుడి విశ్వరూపం - prakasam
భానుడి సెగకు ప్రకాశం జిల్లాలోని ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోజురోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతుంది. ప్రజలు బయటకు రావాలంటే ఎండ వేడికి భయపడుతున్నారు.
ప్రకాశం జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాుడు. ప్రజల నడి నెత్తిపై నిప్పుల కుంపటిలా తయారైయ్యాడు. నగరంలో వీచే వడగాల్పులకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తీవ్ర ఎండ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. పది గంటల దాటితే విధుల్లోకి రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నానికి పట్టణంలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తే తమ వెంట విధిగా కండువా, రుమాలు, టోపీలు పెట్టుకుంటున్నారు. శీతల పానీయాలు, షర్బత్ కేంద్రాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి.