తిరుమల తిరుపతి దేవాస్థానం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీనివాసుని కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. తితిదే వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాల నడుమ స్వామివారికి పుణ్యాహవచనం, రక్షాధారణ, జీలకర్రబెల్లం, యజ్ఞోపవీతధారణ నిర్వహించారు. పట్టణానికి చెందిన చెక్కా హరి దంపతులు స్వామివారికి కన్యాదానం చేశారు. మంగళసూత్రాలకు గౌరీపూజ నిర్వహించి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు మాంగళ్యధారణ చేశారు. అనంతరం తలంబ్రాల వేడుకను చూసి భక్తులు ఎంతో పరవశులయ్యారు. స్వామి అమ్మవార్లను స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పాలతో ఎంతో సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకను తిలకించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అన్నమయ్య కీర్తనలు భక్తులను భక్తిపారవశ్యంలో ముంచాయి.
కల్యాణం... కమనీయం... శ్రీనివాసుని పరిణయం - ongole
తితిదే ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన శ్రీనివాసుని కల్యాణోత్సవం నయన మనోహరంగా సాగింది. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
శ్రీనివాస కల్యాణం