'దర్శి ప్రజలకు శిద్ధన్నే కావాలి' - శిద్ధా
దర్శి స్థానం వేరే ఎవరికి కేటాయించవద్దని శిద్ధా రాఘవరావు అభిమానులు పట్టుబడుతున్నారు. శిద్ధాకే సీటు కేటాయించాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నినాదాలు చేశారు.
ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ స్థానంపై ఉత్కంఠకు తెరపడలేదు. దర్శి స్థానాన్ని శిద్ధా రాఘవరావుకే ఇవ్వాలని ఆయన అభిమానులు హచ్చల్ చేశారు. దర్శి సీటు శిద్ధాకే కేటాయించాలని సీఎం చంద్రబాబును ఒప్పించాలని పట్టుబడుతున్నారు. 2014లో ఎన్నికల్లో గెలిచి దర్శి అభివృద్ధికి తీవ్రంగా కృషిచేసిన శిద్ధాకే మళ్లీ సీటు ఇవ్వాలనికోరుతున్నారు. ఆయన అభిమానుల్లో కొంతమంది వాటర్ ట్యాంకు ఎక్కి దర్శికి శిద్ధా చిన్నన్న అని నినాదాలు చేశారు. దర్శి స్థానాన్ని కేటాయించకపోతే తామంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని తెలిపారు. కొంతమంది నాయకులు సీఎం చంద్రబాబును కలుసుకునేందుకు అమరావతి వెళ్లారు.