ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు 16వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ నెలకొంది. గ్రామంలోని 100 ఇళ్లల్లో ఫ్యాన్, ఫ్రిజ్ , టీవీ, సెల్ ఫోన్లు.. అన్నిరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోగా....సుమారు 20లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే షార్ట్ సర్క్యూట్ అయ్యిందని... గ్రామస్తులు అధికారులపై మండిపడుతున్నారు.
గిద్దలూరులో హైఓల్టేజ్.. గృహోపకరణాలు దగ్ధం
ప్రకాశం జిల్లాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమయ్యాయి. ఫ్యాన్, ఫ్రిజ్, టీవీ, సెల్ఫోన్లు.. అన్నిరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. విద్యుత్ శాఖ అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గిద్దలూరులో షార్ట్ సర్కూట్