ప్రకాశం జిల్లా చీరాల పురపాలక సంఘ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా కార్మికులకు కనీసం 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని కార్మికసంఘ నేత శామ్యూల్ డిమాండ్ చేశారు. గతంలో సమ్మె చేసినప్పుడు విధుల్లోంచి తొలగించిన 12 మంది సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అనంతరం పురపాలక కమిషనర్ రామచంద్రారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు.
సమస్యలు పరిష్కరించాలని పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - sanitary workers
సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ చీరాల పురపాల సంఘ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు.
పారిశుద్ధ్య కార్మికుల ధర్నా