ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ఇరుకు...డివైడర్ల తొలగింపు - REMOVED

వాహనాల రద్దీ దృష్ట్యా ప్రకాశం జిల్లా దర్శిలోని తూర్పు చౌటపాలెం వెళ్లే దారిలో డివైడర్లను తొలగిస్తున్నారు. సీసీ రోడ్డు వేసేటప్పుడే మార్జిన్లను క్రమబద్దీకరించి నిర్మించినట్లయితే ఇప్పుడు అప్పుడు డివైడర్లకు వేసిన ఖర్చు... ఇప్పడు తొలగించేందుకు చేస్తున్న ఖర్చు రెండూ ప్రభుత్వానికి మిగిలేవి అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

రోడ్డు వెడల్పు...డివైడర్ల తొలగింపు

By

Published : Aug 16, 2019, 2:34 PM IST

ప్రకాశం జిల్లా దర్శిలో డివైడర్లను తొలగిస్తున్నారు. వాహనాల రద్దీ...ప్రయాణికుల సౌకర్యార్థం వీటి తొలగింపు కార్యక్రమానికి అధికారులు పూనుకున్నారు. నాలుగు కూడళ్లలోని గడియారం స్తంభం నుంచి తూర్పు చౌటపాలెంలో వెళ్లే దారిలో ముఖ్యమైన కార్యాలయాలు ఉన్న కారణంగా... జనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. దీని దృష్య్టా ... గత ప్రభుత్వ హయాంలో సిమెంట్ రోడ్డుపై డివైడర్లను ఏర్పాటు చేశారు. వీటిని ఏర్పాటు చేసే ముందు మార్జిన్లు క్రమబద్దీకరించి నిర్మించినట్లయితే... ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని ప్రజలు తెలిపారు. ఓ ప్రముఖ వ్యాపారికి చెందిన కాంప్లెక్స్ ఈ ప్రాంతంలో ఉన్న కారణంగా అప్పటి కాంట్రాక్టర్ రోడ్డును వెడల్పు చేసే సాహసం చేయలేక పోయాడని ఆరోపణలున్నాయి.

రోడ్డు వెడల్పు...డివైడర్ల తొలగింపు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details