రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబం... ఒకరు మృతి - కనిగిరిలో రోడ్డు ప్రమాదం న్యూస్
ప్రకాశం జిల్లా లింగారెడ్డిపల్లికి చెందిన ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. కనిగిరి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. ఆమె భర్త, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు.
మరదలి పెళ్లి పనుల నిమిత్తం సామన్ల కొనుగోలుకు.. ప్రకాశం జిల్లా లింగారెడ్డిపల్లికి చెందిన మల్లెల బివలమ్మ.. తన కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్రవాహనంపై కనిగిరి వెళ్లారు. తిరుగొచ్చే క్రమంలో వెన్నెల అపార్ట్మెంట్ వద్ద వీరి బైక్ను ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బివలమ్మ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త, ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.