ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుజరాత్​లో రోడ్డుప్రమాదం.. ప్రకాశం జిల్లా వాసుల మృతి - గుజరాత్​లో రోడ్డుప్రమాదం ప్రకాశం జిల్లా వాసుల మృతి

సోమ్​నాథ్ తీర్థయాత్ర ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. గుజరాత్​ రాష్ట్రం సురేంద్రనగర్ జిల్లా దేవపారాలో  జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా వాసులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఉప రాష్ట్రపతితో ఫోన్​లో మాట్లాడి.. మృతదేహాలను స్వగ్రామానికి చేర్చేలా చొరవ తీసుకున్నారు.

Road accident at gujarath five persons death
గుజరాత్​లో రోడ్డుప్రమాదం..ప్రకాశం జిల్లా వాసుల మృతి

By

Published : Jan 22, 2020, 2:12 PM IST

గుజరాత్​లో రోడ్డుప్రమాదం..ప్రకాశం జిల్లా వాసుల మృతి

సోమ్​నాథ్ తీర్థయాత్ర ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. గుజరాత్​ రాష్ట్రం సురేంద్రనగర్ జిల్లా దేవపారా గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశంజిల్లా వాసులు మృతిచెందారు. జిల్లాలోని చీరాల మండలం జాండ్రపేటకు చెందిన కామిశెట్టి సుబ్రమణ్యం, రాజ్యలక్ష్మి, గణేష్, అఖిల్, దుర్గాభవాని ప్రమాదంలో అక్కడకక్కడే మృతి చెందగా... కుశలత, బొడ్డు నాగేంద్రం, రుషిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొని ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. విషయం తెలుసుకున్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఫోన్​లో మాట్లాడారు. మృతదేహాలను స్వగ్రామానికి చేర్చేందుకు సహకరించారు. మాజీ మంత్రి పాలేటి రామారావు, తెదేపా నాయకులు జంజనం శ్రీనివాసరావు, స్థానికులు.. మృతదేహాలను సందర్శించి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details