ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు భరోసా కేంద్రం.. అన్నదాతకు వరం..! - raithu bharosa centers first started to yarragondapalem news

పల్లెల్లో వ్యవసాయ సేవలను అందించేందుకు రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తొలి విడతలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలో ఐదు కేంద్రాలను వ్యవసాయ శాఖ అధికారులు ప్రారంభించారు.

raithu bharosa centers first started to yarragondapalem
పలెల్లో రైతు భరోసా కేంద్రాలు

By

Published : Jan 26, 2020, 1:08 PM IST

ప్రకాశం జిల్లాలో 5 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు

పల్లెల్లో వ్యవసాయ సేవలు అందించేందుకు వ్యవసాయ శాఖ కొత్తగా.. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. అన్ని రకాల వ్యవసాయ పనిముట్లను ఈ కేంద్రాల ద్వారానే నేరుగా రైతులకు అందించనున్నారు. ఎరువులు, విత్తనాలు, నూతన వ్యవసాయ పరికరాలపై సలహాలు వంటి సేవలను ఇక్కడి నుంచే అందించనున్నారు. తొలి విడతలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలానికి ఐదు చొప్పున భరోసా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని గ్రామాల్లో అద్దె భవనాల్లో కేంద్రాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details