ప్రకాశం జిల్లా చీరాలలో విజయబావుటా ఎగురవేసిన కరణం బలరాం... కార్యకర్తలు, నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాష్ట్రమంతటా వ్యతిరేక పవనాలు వీచినా ప్రకాశం జిల్లా చీరాల ప్రజలు తెదేపా వైపై మొగ్గు చూపారని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. సంక్షేమం- అభివృద్ధిని చంద్రబాబు రెండు కళ్లుగా చూశారని ఆమె అభిప్రాయపడ్డారు. కొన్ని ప్రత్యేకమైన పరిస్దితుల్లో చీరాల వచ్చానని తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కరణం బలరాం కృతజ్ఞతలు తెలిపారు. తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన చోటే మరలా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం తన అదృష్టమని అన్నారు.
'వ్యతిరేక పవనాలున్నా విజయ బావుటా ఎగురవేశాం' - cheerala
ప్రకాశం జిల్లా చీరాలో తెదేపా నేతలు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తెదేపా ఎమ్మెల్యేగా ఎన్నికైన కరణం బలరామకృష్ణమూర్తిని కార్యకర్తలు ఘనంగా సత్కరించారు.
'తెదేపా ఎమ్మెల్యే బలరామకృష్ణ మూర్తికి ఘన సత్కారం'