ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రకాశం జిల్లాలో మరో ముగ్గురు ఎస్​ఐలపై వేటు

By

Published : Aug 29, 2020, 7:16 PM IST

అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించేది లేదని గట్టి హెచ్చరికలు జారీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్​... అందుకు తగ్గట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారు. జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 38మంది అధికారులను శుక్రవారం బదిలీ చేసిన ఎస్పీ...తాజాగా మరో ముగ్గురు ఎస్​ఐలపై వేటు వేశారు.

prakasam sp siddharth kaushal
prakasam sp siddharth kaushal

ప్రకాశం జిల్లాలో పోలీసు సిబ్బంది బదిలీలపర్వం కొనసాగుతోంది. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న 38మంది సిబ్బందిని వేర్వురు ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా మరో ముగ్గురు ఎస్​ఐలపై వేటు వేశారు. కొమరోలు, గుడ్లూరు, దోర్నాల ఎస్​ఐలను విధుల నుంచి తొలగిస్తూ వీఆర్​కి పంపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details