ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లిలోని రైతు భరోసా కేంద్రాన్ని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ మురళీకృష్ణ పరిశీలించారు. భరోసా కేంద్రం అందిస్తున్న సేవలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సజ్జ పంట కొనుగోలుపై ఆరా తీశారు.
'ప్రభుత్వ మద్దతు ధరకు పంట అమ్ముకునేలా చర్యలు' - రానున్న కాలంలో వరి పంటను కూడా కొనుగోలు
ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ బల్లికురవ మంటలంలో పర్యటించారు. గుంటుపల్లిలోని రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. పంట కొనుగోళ్లపై ఆరా తీశారు. వరి పంటను కూడా త్వరలో భరోసా కేంద్రాల్లో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.
'ప్రభుత్వ మద్దతు ధరకు పంట అమ్ముకునేలా చర్యలు'
భరోసా కేంద్రాన్ని ఉపయోగించుకుని ప్రతి రైతు ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకునేలా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. రానున్న కాలంలో వరి పంటను కూడా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మద్దతు ధర మొదటి రకానికి రూ.1888, రెండవ రకానికి రూ.1868 గా ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:రెండు కార్ల ఢీ.. ఏడుగురికి గాయాలు