ప్రకాశం జిల్లా దర్శిలోని పుచ్చలమెట్ట ప్రాంతంలో ఒక కరోనా కేసు నమోదైంది. దీంతో దర్శి పట్టణాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. పాజిటివ్‌గా నిర్ధరణ అయిన వ్యక్తి లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతను ఇటీవల మహారాష్ట్ర వెళ్లి వచ్చాడు. అతన్ని క్వారంటైన్‌కి తరలించి.. నేడు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా వచ్చింది. అతన్ని కొవిడ్ ఆసుపత్రికి తరలించారు.
కొవిడ్ కేసు నమోదు.. కంటైన్మెంట్ జోన్‌గా దర్శి - ప్రకాశం జిల్లాలో కరోనా వార్తలు
ప్రకాశం జిల్లా దర్శి పట్టణాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. పట్టణంలోని పుచ్చలమెట్టకు చెందిన లారీడ్రైవర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. అతన్ని కొవిడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కంటైన్మెంట్ జోన్‌గా దర్శి