ఒళ్లంతా కాలిన గాయాలతో వ్యక్తి మృతి - prakasam district
ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపాన విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి పల్లె క్రాస్ రోడ్డు వద్ద ఓ వ్యక్తి పూర్తిగా కాలిపోయి గాయాలతో పడి ఉన్నాడు. అటుగా వెళ్లిన వారు 108కి సమాచారం ఇవ్వగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అంతుచిక్కని స్థితిలో వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం సమీపంలోని రంగారెడ్డి పల్లె క్రాస్ వద్ద జోగి వేణుగోపాల్ అనే వ్యక్తి పూర్తిగా కాలిపోయి గాయాలతో రోడ్డుపై పడున్నాడు. అటుగా వెళ్తున్న వారు చూసి 108కి సమాచారం ఇచ్చారు. అతనిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.