ప్రకాశం జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడత ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లాలో 227 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 35 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. జిల్లాలో 5 లక్షల 11 వేల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో 2087 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు.
పర్చూరు..
పర్చూరు నియోజకవర్గంలో మొదటి విడత పోలింగ్ సజావుగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఆరు మండలాల్లో 12 గంటల 30నిమిషాలకు 62 శాతం పోలింగ్ నమోదైంది. కారంచేడు, యద్దనపూడి, మార్టూరు ,పర్చూరు, ఇంకోల్లు ,చినగంజాం మండలాలోని 80 పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతగా జరుగుతున్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. పటిష్ట బందోబస్తు నడుమ పోలింగ్ నిర్వహిస్తున్నారు. అయినప్పటికి అక్కడక్కడా చెదురుమదురు ఘర్షణలు జరుగుతున్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. తిరిగి ప్రశాంతగా జరిగేలా చూస్తున్నారు.