చలువ పందిళ్లు...తీర్చును వాహనదారుల ఇబ్బందులు - traffic signals
ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనదారుల ఇబ్బందులు తొలగించేందుకు పోలీసులు వినూత్న ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంగోలులో దాతల సాయంతో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
చలువ పందిళ్లు
ట్రాఫిక్ కూడళ్ల వద్ద వాహనదారులు ఎండ, వానకు ఇబ్బంది పడకుండా ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసులు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. చర్చి కూడలి ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద చలువ పందిరిని ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌశల్ ప్రారంభించారు. దాతల సహాయంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇప్పటికే బస్టాండ్ కూడలి వద్ద పందిరులు ఏర్పాటు చేశామని అన్నారు. మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన దాతలను అభినందించారు.