ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

15 ఏళ్లకే కథలు రాసేస్తారు... నాటకాలు వేసేస్తారు..!

మన ముందు తరం వారు పుస్తకాలను స్నేహితులుగా భావించేవారు. వారి కబుర్లు, సంతోషాలు, జ్ఞాపకాలు అన్నీ అక్షరాలతోనే ముడిపడి ఉండేవి. అయితే.. ఈ సాంకేతిక యుగంలో పుస్తక పఠనం పూర్తిగా తగ్గిపోయింది. కనీసం పేపరైనా చదివే అలవాటులేదు ఇప్పటి మిలీనియల్స్​కు. ఇక పుస్తకాల సంగతి చెప్పనక్కర్లేదు. అయితే చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్న కందుకూరి వీరేశలింగం నానుడిని నిజం చేస్తున్నారు ఆ విద్యార్థినులు. మరి వారి గురించి మనమూ తెలుసుకుందామా..!

ongole government school students package
ఒంగోలు గవర్నమెంట్ స్కూల్

By

Published : Dec 14, 2019, 8:02 AM IST

పుస్తక పఠనంతో సృజనాత్మకత పెంచుకుంటున్నవిద్యార్థినులు

ప్రకాశం జిల్లా ఒంగోలులోని బండ్లమిట్ట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు పుస్తక పఠనాన్ని తమ జీవితంలో భాగంగా చేసుకున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో బడిలోని గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని సృజనాత్మకత పెంచుకుంటున్నారు. కథలు, నాటికల ద్వారా జాతీయ స్థాయి వేదికల్లో పేరు సంపాదించారు.

కథలు రాసేస్తున్నారు

నీతికథలు చదివిన పిల్లల్లో మంచి నడవడిక అలవాటవుతుంది. అవే కథలు పిల్లలు రాస్తే నిజంగా అభినందించాల్సిందే. ఆ విద్యార్థులు అదే చేస్తున్నారు. నిత్యం పుస్తక పఠనంతో భాష మీద పట్టు సాధించారు. 15 ఏళ్లకే కథలు, నాటికలు రాసే స్థాయికి ఎదిగారు. రాయడమే కాదు వాటిని వినసొంపుగా చెప్పడంలోనూ మెప్పిస్తారు. కథల్లో జీవం ఉట్టిపడేలా రాయడం వారి ప్రత్యేకత. ఇటీవల గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కథల పోటీల్లో షేక్ మస్తాన్ అనే విద్యార్థిని ప్రథమ బహుమతి అందుకుంది.

పుస్తక పఠనంతోనే సాధ్యం

ఈ విజ్ఞానమంతా పుస్తక పఠనంతోనే అలవడిందని చెప్తారు విద్యార్థులు. ఇదంతా తమ పాఠశాల గ్రంథాలయంలో పుస్తకాల కొరత లేకుండా చూసిన ఉపాధ్యాయుల వల్లే సాధ్యమైందని చెబుతున్నారు. ప్రకాశం గ్లోబల్ ఎన్నారై సంస్థ ప్రతినిధులు గ్రంథాలయానికి కొన్ని పుస్తకాలు అందిస్తే... ప్రభుత్వం ఇచ్చే రూ. 10 వేలతో ఇంకొన్ని కొనుగోలు చేశారు. తెలుగు ఉపాధ్యాయిని ఝాన్సీ.. విద్యార్థులకు కథలు, కవితలు రాయడం అలవాటు చేశారు. వీరు ప్రదర్శించిన నాటిక రాష్ట్ర స్థాయిలో నంది బహుమతి అందుకుంది. అంతే కాదు దిల్లీలోనూ నాటకం ప్రదర్శించే స్థాయికి చేరుకున్నారీ విద్యార్థులు. పుస్తక పఠనం కేవలం తమలోని సృజనాత్మకత వెలికి తీయడమే కాకుండా బట్టీ చదువులకు స్వస్తి పలికి చదువుని ఇష్టంగా మార్చిందని ఆనందంగా చెబుతున్నారు అక్కడి విద్యార్థినులు.

ఇవీ చదవండి:

టిక్ టాక్ స్నేహం... వివాహిత, ఇద్దరు పిల్లలు అదృశ్యం..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details