అక్కడి విద్యార్థినిలు కేవలం చదువుకే పరిమితం కాలేదు. అబ్దుల్ కలాం స్ఫూర్తితో ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్నారు. జాతీయ నాయకుల అడుగుజాడల్లో నడుస్తూ... దేశభక్తిని పెంచుకుంటున్నారు. వారే ప్రకాశం జిల్లా చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినిలు.
పాలిటెక్నిక్ మెుదటి సంవత్సరం చదువుతున్న ఈసీఈ, ట్రిపుల్ఈ విద్యార్థినిలు తమ మేథస్సుకు పదునుపెట్టి ఎల్ఈడీ బల్బులతో త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. వారంరోజుల పాటు కష్టపడి 7 అడుగుల పొడవు, 13 అడుగుల వెడల్పుతో జాతీయ జెండాను తయారు చేశారు. చెన్నై నుంచి సామగ్రిని కొనగోలు చేసి ఈ తెరను తయారు చేసినట్లు విద్యార్థినులు వివరించారు. 4 వేల ఎల్ఈడీ బల్బులు వినియోగించినట్లు తెలిపారు.