రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖాధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. శివాలయం, చెన్నకేశవ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేటట్లు అభివృద్ధి చేస్తున్నామని, అర్చకుల సమస్యలు, ఆలయాల్లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి అన్నారు. బ్రాహ్మణ కార్పరేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
చెన్నకేశవస్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి వెల్లంపల్లి - prakasam district
ప్రకాశం జిల్లా ఒంగోలులో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయాల్లో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.
చెన్నకేశవస్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి వెల్లంపల్లి