ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'లాక్ డౌన్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడండి' - ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అధికారులతో మంత్రి ఆదిముూలపు సురేశ్ వీడియో కాన్ఫరెన్స్ తాజా వార్తలు

కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్​తో ప్రజలెవరూ నిత్యావసరాలకు ఇబ్బంది పడకూడదని.. అవి నిత్యం పంపిణీ అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఎంపీడీఓ, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

minister aadimulapu suresh video conference at mpdo tahasildar at yerragondapalem prakasam district
యర్రగొండపాలెం అధికారులతో మంత్రి ఆదిమూలపు సురేశ్ వీడియో కాన్ఫరెన్స్

By

Published : Apr 18, 2020, 4:09 PM IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో రెండో విడత రేషన్ పంపిణీ వెంటనే ప్రారంభించాలని.. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. యర్రగొండపాలెంలోని క్యాంప్ కార్యాలయంలో ఎంపీడీఓ, తహశీల్దార్లతో కరోనా వైరస్, నిత్యావసర సరకుల పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిత్యావసరాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. కొవిడ్ ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శిలు, ప్రత్యేక అధికారులకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించే విధంగా చూడాలని చెప్పారు. ప్రజలకు అవసరమైన మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details