ఇప్పటికైనా రాజకీయ వేధింపులు ఆపాలి..
ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట మెప్మా ఆర్పీలు ధర్నా నిర్వహించారు. వైకాపా నాయకుడి వేధింపుల వల్ల సూర్యజ్యోతి అనే ఉద్యోగిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనకు కారణమైన రాజకీయ నాయకునిపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్పీలు డిమాండ్ చేశారు.