గీజర్ మరమ్మత్తు పనుల కోసం వెళ్లిన ఓ ప్లంబర్ విద్యుద్ఘాతంతో మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటుచేసుకుంది. మార్కాపురం పట్టణంలోని రామ లక్ష్మణ్ వీధిలో ఓ ఇంట్లో గీజర్ రిపేర్ చేస్తోన్న ప్లంబర్ వెంకట నారాయణ రెడ్డికి,షాట్ సర్క్యూట్ సంభవించి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భయాందోళనలకు గురైన ఇంటి యజమాని, ఇంటికి తాళాలు వేసి పారిపోయాడు. అనంతరం మృతుడి బంధువులకు సమాచారం చేరడంతో భార్య కన్నీరు మున్నీరైంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే తన భర్త బతికేవాడేమోనని భార్య విలపించింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యూదాఘాతంతో ప్లంబర్ మృతి - prakasam
ప్రకాశం జిల్లా మార్కాపురంలో విద్యుదాఘాతంతో ప్లంబర్ప్లంబర్ మృతి చెందాడు. గీజర్ మరమ్మత్తు పనులు చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
కరెంట్ షాక్తో మృతి చెందిన వెంకట్ నారాయణ రెడ్డి