అమూల్‌తో ఒప్పందం చేసుకొని ప్రతిష్టాత్మక ఒంగోలు డెయిరీని మూసేయటానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఒంగోలు నగరపాలక ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించిన ఆయన ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. ఒంగోలు డెయిరీ మీద ఆధారపడి ఎంతో మంది రైతులు, ఉద్యోగులు జీవిస్తున్నారని..వారి జీవనోపాధిని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. డెయిరీ బాధితులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. బెదిరించి చేసుకున్న ఏకగ్రీవాలను గెలుపు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేక తెదేపా అభ్యర్థులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
వైకాపా అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా.. ఒంగోలు పట్టణంలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. తమ ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసి, అభివృద్ధి చేసిన పార్కుల నిర్వహణ కుడా సక్రమంగా లేదన్నారు. జగన్‌పై దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కేసులు ఉన్నాయని విమర్శించారు. జగన్ రెడ్డి గ్యాంగుల కోసం ఇంటర్‌పోల్ వేటాడుతుందని ఎద్దేవా చేశారు.