ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో మద్యం అమ్మకాలు ప్రారంభం - ప్రకాశం జిల్లాలో మద్యం అమ్మకాలు

ప్రకాశం జిల్లాలో మద్యం అమ్మకాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. మార్కాపురం పరిధిలోని కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాలు మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దుకాణాల వద్ద రద్దీ లేకుండా టోకెన్ల విధానం అమలు చేస్తున్నారు అధికారులు.

liquor sales starts in prakasam district
liquor sales starts in prakasam district

By

Published : May 8, 2020, 2:22 PM IST

లాక్​డౌన్​ సడలింపులతో ఇటీవల రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రకాశం జిల్లాలో మద్యం డిపోలు ఒంగోలు, మార్కాపురం కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉండటంతో అక్కడ మాత్రం మద్యం అమ్మకాలు ప్రారంభించలేదు. తాజాగా మార్కాపురం పరిధిలో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో అమ్మకాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. యర్రగొండపాలెం పట్టణంలో మూడు మద్యం దుకాణాలు అమ్మకాలు ప్రారంభించాయి. దుకాణాల వద్ద రద్దీ, తోపులాట జరగకుండా నిన్ననే టోకెన్లు జారీ చేశారు. టోకెన్ మీద షాప్ నెంబర్, సమయం, తేదీ నమోదు చేసి మందుబాబులకు పంపిణీ చేశారు. వారికి ఇచ్చిన టోకెన్ల ప్రకారం నిర్ణీత సమయంలో దుకాణాల దగ్గరకు వచ్చి మద్యం కొనుగోలు చేస్తున్నారు.
ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details