ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 28, 2019, 4:35 PM IST

ETV Bharat / state

హోరాహోరీగా ఖోఖో ఛాంపియన్ షిప్

ఒంగోలులో రెండో ఇంటర్ బాల బాలికల ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు.

KHO KHO games
ఒంగోలులో ఖో ఖో ఛాంపియన్ షిప్

ఒంగోలులో ఖో ఖో ఛాంపియన్ షిప్

ప్రకాశం జిల్లా ఒంగోలులో రెండో ఇంటర్ డిస్ట్రిక్ బాల బాలికల ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పీవీఆర్ బాలుర పాఠశాలలో జరుగుతున్న ఈ పోటీలలో 13 జిల్లాల నుంచి కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ పోటీల్లో మొదటిరోజు బాల బాలికల జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. పోటీలను చూసేందుకు నగరవాసులు ఉత్సాహం చూపారు. గుంటూరు, ప్రకాశం-బాలురు, ప్రకాశం, వైజాగ్-బాలికల మ్యాచ్​లు జరిగాయి. మొదటి మ్యాచ్​లో ఇరు జట్ల పోటీ ఉత్కంఠగా సాగింది.

ABOUT THE AUTHOR

...view details