ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకం మండలం మిట్టపాలెంలో అక్రమంగా దాచివుంచిన పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో గ్రామానికి చేరుకున్న ఎస్సై... 70 క్వింటాళ్లకుపైగా రేషన్ బియ్యంతో పాటు మూడు క్వింటాళ్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు.
70 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ - పీడీఎస్ రేషన్ బియ్యాo
పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. జిల్లాలో వరుసగా పోలీసులు దాడులు నిర్వహిస్తున్నా... అక్రమ దందా కేసులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.
70 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం సీజ్