భార్యపై కత్తితో దాడి చేసిన భర్త - భార్యపై భర్త కత్తితో దాడి వార్తలు
భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా పొదిలి గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన పాశం వెంకట్రావు, ప్రత్యూష భార్యాభర్తలు. వెంకట్రావు ప్రతిరోజు తన భార్యతో గొడవ పడుతుండేవాడు. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని... భార్య, పిల్లల్ని హింసించేవాడు. ఈ క్రమంలో తన భార్యపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త