ఇదీ చూడండి:
గిద్దలూరు వ్యవసాయ మార్కెట్లో తోపులాట
ప్రకాశం జిల్లా గిద్దలూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో టోకెన్ల కోసం తోపులాట జరిగింది. కందులు, శనగలను మద్దతు ధరకు అమ్ముకోవడానికి టోకెన్లు పొందేందుకు మార్కెట్లోకి భారీగా రైతులు చేరుకున్నారు. అధికారులు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయని కారణంగా... తోపులాట జరిగింది. సదుపాయాలు లేక రైతలు ఎండలోనే కూర్చున్నారు. అదీ కాక.. పంటను పరీక్ష చేయడం కోసం మళ్లీ రావాలని చెప్పగా.. రైతులు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను తీర్చాలన్నారు.
అధికారులతో మాట్లాడుతున్న రైతులు