ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు(veligonda project) నిర్వాసితులకు పునరావాస, పరిహార ప్యాకేజి కింద 1,365 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 4,617 మంది నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు కోసం 1,255 కోట్లు, తీగలేరు, వెలిగొండ ప్రధాన కాలువ భూసేకరణ కోసం 110 కోట్లను వెచ్చించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. నిర్వాసితుల ఇళ్ల స్థలాల కోసం వ్యయం చేసిన 46 కోట్లను ఈ మొత్తం నుంచి మినహాయించాల్సిందిగా జలవనరుల శాఖ ఉత్తర్వుల్లో తెలిపింది. పునరావాస, పరిహార ప్రత్యేక కమిషనర్ తో పాటు ప్రకాశం జిల్లా కలెక్టర్ నుంచి 1,411 కోట్ల రూపాయల మేర ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపుల కోసం ప్రతిపాదనలు వచ్చాయని అయితే వాటిని పరిశీలించిన అనంతర అంచనాలను సవరించి 1,365 కోట్లను మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మొత్తంలో 1,255 కోట్లను పునరావాస, పరిహార ప్యాకేజి కోసం, మిగిలిన 110 కోట్లను తీగలేరు, తూర్పు ప్రధాన కాలువ భూసేకరణ కోసం వెచ్చించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
veligonda project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.1,365 కోట్లు మంజూరు - వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 1365 కోట్లు మంజూరు వార్తలు
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.1365 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పునరావాస, పరిహార ప్యాకేజీ కింద ఈ నిధులు మంజూరయ్యాయి.
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.1,365 కోట్లు మంజూరు
Last Updated : Jun 8, 2021, 3:23 PM IST