ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇంతటి నిర్లక్ష్యమా... ఇది మీకు తగున సారూ....?'

ఇటీవల కురిసిన వర్షాలకు కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలు చిత్తడిగా మారాయి. అటు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పడు వర్షం వచ్చిన ఇదే పరిస్థితి అని.. అధికారులు, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని ప్రజలు అంటున్నారు.

government office premises swampy at kanigri Prakasham district due to negligence of officers
'ఇంతటి నిర్లక్ష్యమా... ఇది మీకు తగున సారూ....?'

By

Published : Sep 29, 2020, 7:32 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పరిస్థితి దయానీయంగా ఉంది. బురద, మురికి నీటి గుంతల మాయంగా మారాయి. ఫలితంగా కార్యాలయాలకు వెళ్లాలంటే మహిళలు, వృద్ధులు భయపడుతున్నారు.

సమస్యలను కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్, అధికారుల​ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, మురికి గుంతలలో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసినా... వారిలో ఎటువంటి చలనం లేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలను ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details