ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాటిచ్చారు...వారధి కట్టారు

ఎన్నో ప్రభుత్వాలు మారాయి. పాలకులూ మారారు... సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఎన్నికల వేళ ఇదిగో చేస్తాం... అదిగో చేస్తాం...అన్నారే తప్ప చేసిన వారే లేరు.  ప్రాణాలు బలైపోతున్నా... పట్టించుకున్న నాథుడే లేడు. 2014లో ప్రభుత్వం మారింది... చంద్రబాబు మాటమీద నిలబడ్డారు. సమస్యకు పరిష్కారం చూపించి తీరప్రాంత ప్రజల్లో ఆనందం నింపారు.

By

Published : Mar 2, 2019, 10:05 AM IST

ఏలూరు సాంబశివరావు

ప్రకాశం జిల్లా చిన్నగంజాం, పెద్దగంజాం మధ్య దశాబ్దకాలంగా కొనసాగుతున్న వారధి సమస్యకు తెలుగుదేశం ప్రభుత్వం స్వస్తి పలికింది. రొంపేరు కాలువపై 13 కోట్లతో వంతెన నిర్మించి వారి కల సాకారం చేసింది.

రాష్ట్రవిభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా ఏలూరు సాంబశివరావు పెద్ద గంజాం వచ్చి ప్రజలకు హామీ ఇచ్చారు. నాటు పడవల్లో ప్రయాణించి ప్రాణాలు కోల్పోతున్న వారి ఆవేదన అర్థం చేసుకొని మాటిచ్చారు. తనను గెలిపిస్తే వంతెన నిర్మాణం పూర్తి చేసి వచ్చే ఎన్నికల్లో అదే వంతెనపై నడుచుకుంటూ వచ్చి ఓట్లు అడుగుతానని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సమస్యను పరిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సహాయంతో ఎన్టీఆర్ వారధి నిర్మించారు.

ఏలూరు సాంబశివరావు
వంతెన నిర్మాణంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే పండించే ఆకుకూరలు, పాలు పెరుగు వంటి ఉత్పత్తులు, మత్యసంపదను చిన్నగంజాం మార్కెట్‌కు తరలించే వెసులుబాటు కలిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణ ప్రయాస తగ్గిందంటున్నారు విద్యార్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు.మాటను నిలబెట్టుకున్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు పెద్దగంజాం ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details