ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్దిపాడులో వాహనం ఢీకొని నలుగురుకి గాయాలు

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని ఏడుగుండ్లపాడు వద్ద గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నలుగురు గాయపడ్డారు. శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్​కు తరలించారు. అక్కడినుంచి ప్రత్యేక చికిత్స నిమిత్తం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ROAD_ACCEDENT
ROAD_ACCEDENT

By

Published : Dec 17, 2020, 10:55 PM IST

శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణమవుతున్న బెంగుళూరుకు చెందిన నలుగురిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గాయాలపాలయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని ఏడుగుండ్లపాడు వద్ద గురువారం తెల్లవారుజామున జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్​ తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక చికిత్స కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

బెంగుళూరుకు చెందిన వెంకట్రామిరెడ్డి, వినాసాయి, వేణుగోపాల్ రెడ్డితో పాటు వేరొక వ్యక్తి శుభకార్యానికి హాజరయ్యేందుకు విజయవాడ వచ్చారు. పనులు ముగించుకుని రాత్రి సమయంలో తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో మద్దిపాడు మండలంలోని ఏడుగుండ్లపాడు వంతెన వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి : ఒంగోలు యువకుడి హత్య కేసు.... సీసీ పుటేజీలో దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details