ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆమంచి వర్గీయుల అరాచకం.. మాజీ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం - koduri

ఆమంచి వర్గీయుల బెదిరింపులతో తాజా మాజీ ఎంపీటీసీ కోడూరి వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కలెక్టర్​కు తన సమస్యను విన్నవించుకునేందుకు వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

మాజీ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం

By

Published : Jul 22, 2019, 5:55 PM IST

మాజీ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం

ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద పుల్లరిపాలెం తాజా మాజీ ఎంపీటీసీ కోడూరి వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. తన సమస్యను విన్నవించుకునేందుకు కుటుంబంతో సహా కలెక్టరేట్​కు వచ్చిన వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు వెంటనే అతన్ని ఆటోలో రిమ్స్ కు తరలించారు.

ఆమంచి వర్గీయులు పోలయ్య, అతని కుమారులు తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని... ఇల్లు, ఊరు వదిలి వెళ్లకపోతే చంపుతామని బెదిరింపులకు పాల్పడటం వల్లే తన తండ్రి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కోడూరి కుమారుడు తెలిపారు. వేటపాలెం ఎస్ఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details