ప్రకాశం జిల్లా చీరాల మండలం పాలిబోయినవారిపాలెంలోని ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చేలరేగాయి. దీనికి తోడు ఎక్కువగా గాలి రావటంతో వరుసగా ఉన్న పూరిళ్లు, గడ్డివాములకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఈపురుపాలెం ఎస్సై సుబ్బారావు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాపట్ల నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం...10 పూరిళ్లు దగ్దం - prakasham district latest news
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పది పూరిళ్లు దగ్ధమైన ఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలం పాలిబోయినవారిపాలెంలో జరిగింది. బాపట్ల నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం...10 పూరిళ్లు దగ్దం
అప్పటికే 10 పూరిళ్లు, రెండు గడ్డివాములు, 10 తాటిచెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 25 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కూలిపనులు చేసుకునేందుకు వెళ్లామని..ఈ ప్రమాదంతో కట్టు బట్టలతో మిగిలిపోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: