ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిగరెట్ అంటుకుని గడ్డి వాము దగ్ధం

ఆకతాయిలు సిగిరెట్​ తాగి వరిగడ్డి వాము సమీపంలో వేయడంతో మంటలు వ్యాపించాయి. గడ్డి వాము అంటుకుంది. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలివి.

fire accident in prakasam dst  due to sigarate peek
ఒక్క సిగిరెట్​కు 50వేల ఆస్తి నష్టం....

By

Published : Apr 19, 2020, 7:27 AM IST

Updated : Apr 19, 2020, 9:32 AM IST

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం కొట్టాలపల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి... వరిగడ్డి వాము సమీపంలో వేశారు. మంటలు క్రమంగా వ్యాపించి పక్కనే ఉన్న వరిగడ్డి వాము అంటుకుంది. ఈ ఘటనలో సురవరపు రామయ్యకు చెందిన వరిగడ్డి వాము పూర్తిగా దగ్ధం అయింది. సమాచారం అందుకున్న కనిగిరి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కనిగిరి అగ్నిమాపక అధికారి తెలిపిన వివరాల ప్రకారం దగ్ధమైన వరిగడ్డి వాము విలువ రూ.50,000 ఉంటుందన్నారు. ఈ ఘటనకు పాల్పడింది ఆకతాయిలేనని తెలిపారు.

Last Updated : Apr 19, 2020, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details