ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని అన్ని మండాల రైతులు సీపీఎం ఆధ్వర్యంలో దర్శి గడియార స్తంభం సెంటర్లో రోడ్డుకు అడ్డంగా బైఠాయించి వరి సాగుకు నీరివ్వాలని ఆందోళ చేపట్టారు. రైతులను పోలీసులు అదుపులోకి తీసుకొని తహశీల్దారు ఎదుట హాజరుపరిచగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. స్పందించిన తహశీల్దార్... పైఅధికారులతో సమస్య వివరిస్తానని, వీలైనంత వేగంగా పరిష్కరించేలా చేస్తానని హామీ ఇచ్చారు. రైతు సంఘం నాయకుడు చలమయ్య మాట్లాడుతూ నీరంతా సముద్రంలోకి వదిలేస్తున్నారని ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టి రైతులకు నీరందించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళ చేస్తామని హెచ్చరించారు.
వరి సాగుకు నీరివ్వండి సార్?
జలాశయాల్లో నిండా నీళ్ళున్నా సాగుకు నీరివ్వకపోవటంలో ఆంతర్యమేమిటో తెలియటంలేదని ప్రకాశం జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మొండి వైఖరి వీడి రైతన్నలకు సాగునీటిని సరఫరా చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు.
సాగుకు నీరివ్వాలని రైతులు ఆందోళన