ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉపాధి హామీ పథకం కూలీలు ధర్నా నిర్వహించారు. నాలుగు వారాలుగా తమకు వేతనాలు చెల్లించటం లేదని ఆందోళన చేపట్టారు.
వేతనాలు చెల్లించటంలేదని ఉపాధి కూలీల ఆందోళన..
నాలుగు వారాలుగా తాము పని చేస్తున్నా వేతనాలు మాత్రం చెల్లించడం లేదంటూ ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉపాధి హామీ పథకం కూలీలు ధర్నా నిర్వహించారు.
ఉపాధి కూలీల ఆందోళన..
కరోనా కాలంలో తమకు ఉపాధిహామీ పథకం పనులే దిక్కని.. పని చేస్తున్నా డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. అధికారుల నిర్లక్షం వల్లే చేసిన పనికి అసలు పేమెంట్లే కంప్యూటర్లో నమోదు చేయలేదని అన్నారు. సాంకేతిక సమస్య వల్లే తాము పేమెంట్లు చేయలేక పోతున్నామని సిబ్బంది చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వేతనాలు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరుతున్నారు.
ఇది చదవండిచీరాలలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళనలో ప్రజలు