ఎన్నో రోజులుగా ఊరిస్తున్న మేఘాలు వర్షించాయి. ప్రకాశం జిల్లాలోని మర్కాపురం, గిద్దలూరు పట్టణాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం కోసం ఎన్నో రోజులనుంచి ఎదురు చూస్తున్న ప్రజలకు కాస్త ఊరట లభించింది. ఉదయాన్నే మెదలైన వాన ఎడతెరిపి లేకుండా కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
వర్షంతో ఉపశమనం... రైతుల్లో ఆనందం - వర్షం
ప్రకాశం జిల్లాలో కురిసి వర్షంతో ప్రజలు ఉపశమనం పొందారు. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురవడంతో రైతులు పనుల్లో నిమగ్నమయ్యారు.
ప్రకాశం జిల్లాలో భారీ వర్షం
నాళాలు పొంగి రోడ్లపైకి రావడంతో మర్కాపురంలోని తహసీల్దార్, ట్రెజరీ, మండల పరిషత్ కార్యాలయల్లోకి భారీగా నీరు చేరింది. ఇలాంటి వాన నాలుగైదు సార్లు పడితే తాగునీటి సమస్యకి కాస్త ఉపశమనం కలుగుతుందని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు.
ఇదీ చూడండి:కనువిందు చేస్తున్న పిచ్చుక గూళ్లు