ప్రకాశం జిల్లా దొనకొండను ప్రభుత్వం పారిశ్రామికవాడగా ప్రకటించింది. దానిలో భాగంగా రాగముక్కపల్లి వద్ద పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ప్రభుత్వం రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తున్నారు. మంగిపూడి వద్ద హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్... విజయవాడ నుంచి కర్ణాటకలోని ధర్మపురి వరకు పెట్రోల్, డీజిల్‌ను పైపులైన్ల ద్వారా సరఫరా చేయడానికి 2300 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభించి... నాలుగు చోట్ల పంపింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిలో భాగంగా మంగినపూడి వద్ద లిఫ్టింగ్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంటు పూర్తైతే తమకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చుట్టుపక్కల గ్రామాల్లోని యువత భావిస్తోంది.
కరవు నేలకు వరంగా... దొనకొండ పారిశ్రామిక వాడ
దొనకొండ పారిశ్రామికవాడ స్థానిక నిరుద్యోగులకు వరం కానుంది. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌కు సంబంధించిన లిఫ్టింగ్ ప్లాంటు మంగినపూడిలో ప్రారంభించారు. ఈ ప్లాంటు పూర్తైతే చుట్టుపక్కల గ్రామాల యువతకు, ప్రజలకు మెండుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
కరవు నేలకు వరంగా దొనకొండ పారిశ్రామిక వాడ