ప్రకాశం జిల్లా అలవలపాడు చెందిన వెంకట సుబ్బారెడ్డికి ముగ్గురు ఆడపిల్లలు.తాను కాలం చేస్తే పెద్దకూతురే కొరివి పెట్టాలని అంటుండే వాడు.అతని కోరిక మేరకు వెంకట సుబ్బారెడ్డి మృతదేహానికి పెద్దకూతురు భానుమతి తలకొరివి పెట్టి తండ్రి ఆఖరి కోరికను నెరవేర్చింది.ఈ ఘటన చూసిన గ్రామస్తులందరు కంటతడిపెట్టారు.
కన్న తండ్రికి తలకొరివి పెట్టిన పెద్దకూతురు
మగబిడ్డే లేని ఆ తండ్రికి పెద్దకూతురే కొరివిపెట్టింది. తనకున్న ముగ్గురు కూతుళ్లలో పెద్దకూతురే కొరివి పెట్టాలన్న తండ్రి కోరికను తీర్చుతూ, పెద్దకూతురు కన్నీరుమున్నీరుగా విలపించింది.
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు!