ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాపు కాసి కాసులు కొట్టేశారు...ఆపై చిక్కారు - police

రాత్రి సమయాల్లో ప్రయాణికులను బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితులను చీరాల పోలీసులు అరెస్టు చేశారు.

By

Published : Aug 4, 2019, 12:24 PM IST

దారి దోపిడీలు చేస్తున్న ఇద్దరు అరెస్టు

దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.5 సవర్ల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 28న రాత్రి సమయంలో జరుబులవారిపాలెంకు చెందిన సుబ్బారావు ద్విచక్రవాహనంపై స్వర్ణనది వంతెన వెళ్తుండగా నిందితులు అడ్డుపడ్డారు. నిందితులు మత్తు శివశంకర్, పెదప్రోలు బ్రహ్మంరెడ్డి.. సుబ్బారావును బెదిరించి 1200 నగదు, 2.5 సవర్ల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. బాధితుడు చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పథకం ప్రకారం దండుబాటలో ఉన్న నిందితులను పట్టుకున్నారు. నిందితుల్లో ఒకరు మైనర్​ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడని డీఎస్పీ జయరామరెడ్డి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details