ప్రకాశం జిల్లా అద్దంకిలో పేదలకు దాతలు సహాయం చేస్తున్నారు. వివిద రాష్ట్రాల నుంచి వచ్చిన 60 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు కొంతమంది దాతలు. 19వ వార్డుల్లో కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, శ్రీదత్త పాదుకా క్షేత్ర నిర్వాహకులు పాల్గొన్నారు.
అద్దంకిలో నిత్యావసరాలు పంపిణీ - అద్దంకిలో నిత్యావసరాలు పంపిణి
కరోనా వైరస్ వ్యాధి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో పేదలు, రోజువారి కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పనులు లేక, ఆదాయం రాక కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి సహాయం చేస్తూ మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు దాతలు.

అద్దంకిలో నిత్యావసరాలు పంపిణీ