ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఫసల్ బీమా నగదు జమ కాని రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, తర్లుపాడు మండలాల్లో దరఖాస్తు ప్రక్రియ చేపట్టినట్లు డీడీఏ శ్రీనివాసరావు తెలిపారు.
ఫసల్ బీమా అందని రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
ప్రకాశం జిల్లాలో ఫసల్ బీమా అందని రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, తర్లుపాడు మండలాల్లో ప్రక్రియ చేపట్టారు. రూ.1 చెల్లించినా ఇన్సురెన్స్ సంస్థ విడుదల చేసిన జాబితాలో పేరు లేకపోతేనే దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు.
దరఖాస్తుల స్వీకరణ
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1.30లక్షల మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.238 కోట్లు జమయ్యాయని ఆయన వివరించారు. రూ.1 బీమా చెల్లించినా ఇన్సూరెన్స్ సంస్థ విడుదల చేసిన జాబితాలో పేరు లేకపోతేనే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారని రైతులకు సూచించారు.
ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి