ప్రకాశం జిల్లా చీరాలలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కరోనా లాక్ డౌన్ కారణంగా పూర్తిగా పనులు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కార్మికులకు 10 వేల రూపాయాలిచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చీరాల సీపీఐ కార్యదర్శి మేడా వెంకట్రావు డిమాండ్ చేశారు.
ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగం కుదేలైందని, కార్మికులను ఆదుకోవాలని మేడా వెంకట్రావు అన్నారు. భవననిర్మాణ కార్మికుల యూనియన్ నేతలు భౌతికదూరం పాటిస్తూ నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లతో రెవిన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు.