ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇనుప కంచెలో ఇరుక్కున్న గోవు... కాపాడిన స్థానికులు

కరోనా మహమ్మారి కారణంగా మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. తిండి పెట్టేవారు లేక రహదారి వెంట తిరిగే గోవుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆహారం దొరక్క విలవిల్లాడుతున్నాయి. కడుపు నింపుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో నానా అవస్థలు పడుతున్నాయి. తాజాగా చీరాల రెడ్​జోన్​ ప్రాంతంలో ఓ గోవు ఇనుప కంచెలో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడింది.

ఇనుప కంచెలో ఇరుక్కున్న గోవు
ఇనుప కంచెలో ఇరుక్కున్న గోవు

By

Published : Jun 17, 2020, 9:03 PM IST

లాక్​డౌన్​ కారణంగా ​ప్రజలతో పాటు మూగజీవాలు సైతం ఇబ్బందులు పడుతున్నాయి. ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదైన కారణంగా రెడ్​జోన్​ ప్రాంతాల్లో ఇనుప ముళ్ల కంచెలను రహదారికి అడ్డంగా వేశారు. ఈ క్రమంలో పట్టణంలోని కూరగాయల మార్కెట్​ వెనుక గొల్లపాలెంకు వెళ్లే దారిలో ఇనుప కంచెలో ఓ గోవు చిక్కుకుపోయింది. కంచె నుంచి తప్పించుకునే క్రమంలో ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఎట్టకేలకు కంచెనుంచి గోవును బయటకు తీశారు. గాయాలయిన చోట పసుపు రాసి ఆహారం అందించారు. రహదారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలి కానీ ఇనుప కంచె వేయటం ఏంటని పలువురు ప్రశ్నించారు. పట్టపగలే ఓ మూగజీవం ఇరుక్కుపోయిందని.... అదే రాత్రి సమయంలో ఎవరైనా కంచె దాటాలని ప్రయత్నిస్తే వారి గతేంటని ఆందోళన వ్యక్తంచేశారు. ఇనుప కంచెను వెంటనే తీసివేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:మనుషుల్నే కాదు.. మానవత్వాన్ని చంపేస్తున్న కరోనా

ABOUT THE AUTHOR

...view details