ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆమంచి, బలరాం వర్గీయుల మధ్య ఘర్షణ.. 144 సెక్షన్​ అమలు

పందిళ్లపల్లిలో కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనెల 15 వరకు నియోజకవర్గంలో 30 యాక్ట్, 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Section 144 at pandilla village
ఆమంచి, బలరాం వర్గీయుల మధ్య ఘర్షణ 144 సెక్షన్​ అమలు

By

Published : Nov 1, 2020, 2:14 PM IST

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఈనెల 15 వరకు 30 యాక్ట్, 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో.. పోలీసులు పందిళ్లపల్లిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details