విద్యతోపాటు సంస్కారం ఎంతో ముఖ్యమని... ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ విద్యార్థులకు సూచించారు. జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, కందుకూరు పట్టణాల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి విద్యార్థి వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకోవాలని కలెక్టర్ సూచించారు. పదో తరగతి పరీక్షల్లో జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ప్రతిష్ఠాత్మక ఐఐఐటీలో అత్యధిక మంది సీట్లు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్ అందజేశారు.
'ప్రతి విద్యార్థి నచ్చిన రంగాన్ని ఎంచుకొని కృషి చేయాలి' - COLLECTOR
ప్రకాశం జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ హాజరయ్యారు. విద్యార్థులు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని అందులో కృషి చేయాలని సూచించారు.
ప్రకాశం జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షల అవగాహన కార్యక్రమం