ETV Bharat / city

అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యం

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధికి బోస్టన్‌ కమిటీ పలు సూచనలు చేసింది. రాష్ట్రాన్ని మొత్తాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించింది. ఆ ప్రాంతాల్లోని సహజ వనరులు, ఇతర అంశాలను బీసీజీ పరిగణనలోకి తీసుకుంది. ప్రాంతాల వారీగా వివిధ అభివృద్ధి అంశాలన్ని పేర్కొంది. అమరావతి రాజధాని ప్రాంతంలో అత్యాధునిక వ్యవసాయం అభివృద్ధి చేయవచ్చని, విద్యా కేంద్రంగానూ తీర్చిదిద్దేందుకు అపారమైన అవకాశాలున్నాయని తెలిపింది.

Bcg report on ap capital
అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : బీసీజీ నివేదిక
author img

By

Published : Jan 4, 2020, 6:05 AM IST

అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : బీసీజీ నివేదిక
రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఏడు జిల్లాలు పారిశ్రామిక అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని బోస్టన్‌ కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. వాటిపై దృష్టి సారించాలని పేర్కొంది. రాష్ట్రాన్ని ఆరు ప్రాంతాలుగా వర్గీకరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో కూడిన ఉత్తరాంధ్రను ఒక ప్రాంతంగా... ఉభయ గోదావరి జిల్లాలను గోదావరి డెల్టాగా, కృష్ణా, గుంటూరు జిల్లాలను కృష్ణా డెల్టాగా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను దక్షిణాంధ్రగా, రాయలసీమ జిల్లాలను పశ్చిమ, తూర్పు రాయలసీమ ప్రాంతాలుగా విభజించింది. పారిశ్రామిక, వ్యవసాయ, మౌలిక వసతులు, సామాజిక సూచికల్లో సమతుల్య అభివృద్ధి సాధనకున్న అంశాలను తన నివేదికలో ప్రస్తావించింది.
  • ఉత్తరాంధ్ర ప్రాంతం : వైద్య పరికరాల తయారీ, జీడిపప్పు, కాఫీ, పసుపు తదితర వాణిజ్య పంటల సాగుకు ప్రోత్సాహం, భోగాపురం విమానాశ్రయ అభివృద్ధితోపాటు, వైద్య, వినోద, పర్యాటక కేంద్రాల అభివృద్ధి
  • గోదావరి డెల్టా : పెట్రో కెమికల్స్‌, ప్లాస్టిక్‌ తయారీ, ఆహార శుద్ధి పరిశ్రమలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం
  • కృష్ణా డెల్టా : ఆహార శుద్ధి పరిశ్రమలు, అత్యాధునిక వ్యవసాయ కేంద్రం, మత్స్య పరిశ్రమ, మచిలీపట్నం పోర్టు అభివృద్ధి
  • దక్షిణాంధ్ర : ఆటో మొబైల్స్ తయారీ, పేపర్ పల్ప్, తోలు, ఫర్నిచర్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల క్లస్టర్స్, మత్స్య ఎగుమతులకు ప్రోత్సాహం, గోదావరి-పెన్నా అనుసంధానం, మైపాడు బీచ్ అభివృద్ధి
  • పశ్చిమ రాలయసీమ : వస్త్ర, లాజిస్టిక్స్ పరిశ్రమల అభివృద్ధి, వాహన విడి భాగాలు, సేంద్రియ ఉద్యానసాగుకు మద్దతు, బిందు సేద్యానికి ప్రోత్సాహం, గోదావరి-పెన్నా అనుసంధానం, జాతీయ రహదారులతో అనుసంధానం
  • తూర్పు రాయలసీమ : ఎలక్ట్రానిక్స్‌ తయారీ కేంద్రం, ఉక్కు కర్మాగారం ఏర్పాటు, అత్యాధునిక వ్యవసాయం(టమాటాల శుద్ధి) గండికోట బెలుం గుహలను కలుపుతూ పర్యావరణ-సాహస పర్యాటక సర్య్కూట్ అభివృద్ధి

కృష్ణ, గోదావరి డెల్టా ప్రాంతంలో లేని తొమ్మిది జిల్లాల్లో పంట దిగుబడి పెరగాలని, మహిళా అక్షరాస్యతపై దృష్టిసారించాలని, విదేశీ పర్యాటకుల రాకకు అనుకూల అంశాలు పరిశీలించేందుకు అనువైన చర్యలు తీసుకోవాలని బోస్టన్‌ కమిటీ నివేదికలో సూచించింది.

ఇదీ చదవండి :

'సీఎం గారూ..! మీ ఇల్లు ఎవరి పేరుతో ఉందో చెప్పండి'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.