ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Karamchedu doctor: మంత్రి బాలినేని చొరవ.. కారంచేడు వైద్యుని చికిత్సకు సీఎం రూ.కోటి సాయం - కారంచేడు వైద్యుడు చికిత్స వార్తలు

కొవిడ్ బాధితులకు వైద్యం అందిస్తూ.. అదే వైరస్ బారిన పడిన కారంచేడు పీహెచ్​సీ డాక్టర్ ఎన్.భాస్కరరావు చికిత్సకు సీఎం జగన్ రూ.కోటి నిధులు అందజేశారు. ఈ విషయంలో మంత్రి బాలినేని చొరవ చూపించారు.

CM Jagan donates Rs 1 crore for Karanchedu doctor treatment
కారంచేడు వైద్యుని చికిత్సకు సీఎం జగన్ రూ.కోటి సాయం

By

Published : Jun 5, 2021, 10:48 AM IST

ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ఎన్‌.భాస్కరరావు చికిత్సకు సీఎం జగన్‌ రూ.కోటి నిధులు అందజేశారు. కొవిడ్‌ బాధితులకు వైద్యం అందజేస్తూ అదే మహమ్మారికి చిక్కిన భాస్కరరావు... విషమ పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడైనందున తక్షణం వాటిని మార్చాలని వైద్యనిపుణులు సూచించారు. ఇందుకు రూ.1.5 కోట్ల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైద్యుడి బంధువులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారు. ఆయన శుక్రవారం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వెంటనే వైద్యుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి రూ.కోటి విడుదల చేయించారు.

అవసరమైతే మిగిలిన రూ.50 లక్షలు కూడా అందజేసేందుకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. వైద్యుడి దయనీయ పరిస్దితి పై "ఊపిరి నిలిపెందుకు ఊరంతా' అనే కథనం.. ఈటీవీ-ఈటీవీ భారత్​లో ప్రసారమైన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details